Podu Lands Distribution |తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవనాన్ని, నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మరోసారి ప్రజలకు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించగలిగామన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మితం కానున్నాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి సమస్యలను అధిగమించామని అన్నారు. జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ(Podu Lands Distribution) ప్రారంభం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.