KCR Visits Kondagattu Temple: దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించగా.. అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. మొత్తంగా రూ.600 కోట్లతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ ఉదయం కొండగట్టుకు చేరుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కాగా కొండగట్టు అభివృద్ధి జరిగితే స్థానిక ప్రజలకు జీవనోపాధి పెరగడంతోపాటు, అక్కడి భూములకు విలువ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.