ప్రధాని నరేంద్ర మోడీ రేపు(ఏప్రిల్ 8న) తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్‌లో మోడీ సభా ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నగరంలో పలు ప్రాజెక్టులను మోడీ(Modi) ప్రారంభించనున్నారని తెలిపారు. కేసీఆర్(KCR) నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఆగిపోయిందని విమర్శించారు. మెరుగైన రవాణా ఉంటేనే ప్రజల జీవన పరిస్థితులు బాగుంటాయి.
హైదరాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో వందే భారత్ రైలును మోడీ ప్రారంభిస్తారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు మీదుగా తిరుపతి వెళ్తుంది. తెలంగాణపై కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మోడీ హయాంలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మించాం. ఇప్పటికే అన్ని స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించాం. అంకిత భావంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణలో రైలు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఎయిమ్స్(AIIMS) భవనానికి రూ.1350 కోట్లతో భూమి పూజ చేస్తారు. ప్రధాని వస్తే స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిరసనలకు సిద్ధమవుతోంది అని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది: కేంద్ర మంత్రి
Follow us on: Google News, Koo, Twitter