ప్రధాని సమక్షంలో కేసీఆర్‌ సర్కార్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్(MMTS) సెకండ్ ఫేజ్ నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను స్టార్ట్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రం సహకారం లేకున్నా.. MMTS ప్రారంభిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్, హైవేలు, బీబీనగర్ ఎయిమ్స్ వంటి వాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్న.. ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -
Read Also: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...