Kokapet Land Rates | హైదరాబాద్‌లోని భూముల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత పదేళ్లలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరం కోట్లకు దాటింది. ముఖ్యంగా కోకాపేట్‌లో ఊహించని రేంజ్‌లో పరిస్థితులు మారాయి. అక్కడ ఎకరం 20 కోట్లకు తక్కువ పలికిన దాఖలాలే లేవు. దీంతో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆ భూములను గురువారం ప్రభుత్వం వేలం నిర్వహించింది. దీంతో మరోసారి కోకాపేట్ నియోపోలీస్ భూములు రికార్డు స్థాయి ధర పలికాయి.
Kokapet Land Rates | ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 6లో ఎకరం రూ. 71.25 కోట్లు పలకగా, ప్లాట్ నెంబర్ 7లో ఎకరం రూ. 75.50 కోట్లు పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 8లో ఎకరం రూ. 63.50 కోట్లు, ప్లాట్ నెంబర్ 9లో ఎకరం రూ. 73.50 కోట్లు పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.