Komatireddy Rajagopal Reddy | పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

-

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పందించారు. హైకమాండ్ పిలుపుతో ఈటల రాజేందర్‌(Eatala Rajender)తో కలిసి కోమటిరెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం అని, అందు కోసమే తాను బీజేపీలో చేరానని చెప్పారు. నేను పార్టీ మారుతానని ఎక్కడా చెప్పలేదని సోషల్ మీడియాలో మాత్రం నాపై అనేక కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే లక్ష్య సాధనలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కవిత అరెస్టు, కేసీఆర్ కుటుంబం(KCR Family) అవినీతిపై కేంద్ర సర్కార్ వైఖరిలో మార్పు వస్తే ఈ విషయాన్ని నేరుగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లి కఠినంగా వ్యవహరించాలని కోరుతామని వ్యాఖ్యానించారు. ఒక వేళ బీఆర్ఎస్ విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామే తప్ప మీడియా కథనాలతో తాము పార్టీ మారేది ఉండదన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తమకు తెలుసన్నారు. మునుగోడు ఫలితాలు, కవిత అరెస్ట్ కాకపోవడం, కర్నాటక ఫలితాలతో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో అధిష్టానం ఎదుట నిర్మోహమాటంగా వివరిస్తామన్నారు.

- Advertisement -
Read Also:
1. పోడు రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే న్యూస్
2. సెకండ్ సినిమా అప్‌డేట్ ఇచ్చిన ‘బలగం’ డైరెక్టర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...