Komatireddy Venkat reddy: మునుగోడు ప్రచారానికి దూరంగా ఉంటానని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనను కలవటానికి వచ్చిన అభిమానులతో మాట్లాడిన వీడియో.. ఇప్పుడు వైరల్‌గా మారింది. ”నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలవదు. ప్రచారం చేస్తే మహా అయితే పది ఓట్లు పెరుగుతాయ్ తప్ప.. మునుగోడులో గెలిచే పరిస్థితి లేదు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతుండగా.. మనమేం చేయగలం. ఎంపీగా, ఎమ్మెల్యైగా 25 ఏళ్లు ఉన్నా.. ఇక చాలు” అని వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో, ఆయన పార్టీని త్వరలోనే వీడుతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.
ఇటీవలే సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ కోమటిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్న ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. పీసీసీ పీఠంను తనను కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వటం నుంచి పార్టీ తీరుపై కోమటిరెడ్డి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే తెలియజేశారు. పార్టీలోనే ఉంటూ, పార్టీకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీలో ఉండటం కంటే.. పార్టీని వీడితేనే మంచిదని భావిస్తున్నారు. మరి కోమటిరెడ్డి ఆయన సోదరుడిలా పార్టీని వీడుతారా… లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిందే.
Read also: దూసుకొస్తున్న ‘‘సిత్రాంగ్’’