మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ MP కోమటిరెడ్డి ప్రశంసలు

-

Komatireddy Venkat Reddy |ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి() కలిశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్, విమానాశ్రయాలు, టెక్స్‌టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించాలని కోరినట్లుగా తెలిపారు.

- Advertisement -

మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఇచ్చని వినతి పత్రంలో పేర్కొన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును ఘట్‌కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు.

Read Also: రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...