Komatireddy Venkat Reddy | నాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను: MP కోమటిరెడ్డి

-

తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోను.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యంపై పలు మీడియా ఛానళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను అస్వస్థతకు గురయ్యానని, బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నానని వార్తలు ప్రచురితం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి.. తనకు ఏ ప్రాబ్లం లేదని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. తప్పుడు వార్తలు తెలుసుకొని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన పడవదన్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరానని వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...