Komatireddy Venkat Reddy | స్నేహమంటే ఇదేలే.. రేవంత్, కోమటిరెడ్డి వీడియో హల్‌చల్

-

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy).. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురించి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీలో సూరీడే పాటలోని “వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే. సైగ ఒకరు… సైన్యం ఒకరు. కలిసి కదిలితే కదనమే..” పదాలను ఇందులో జత చేశారు. దీంతో రేవంత్, కోమటిరెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అంతకుముందు కూడా ‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Bhatti Vikramarka)తో కలిసి ఉన్న ఫొటోను కూడా కోమటిరెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్టులు చూసిన కాంగ్రెస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ నాయకులు ఇలాగే ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతకుముందు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే నేతలూ ఇలా కలిసిపోవడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని అభిప్రాయపడుతున్నారు.

కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్క, మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కలిసికట్టుగా ఉంటూ ప్రజాపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు.

Read Also: చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే జలుబు సమస్యలకు చెక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...