కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)పై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చేవెళ్ల సభలో అమిత్ షా కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, ప్రధాని మోడీ(PM Modi)పైనా విమర్శలు చేశారు. త్వరలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలుగంటున్న బీజేపీ(BJP) అంధకారంలోకి వెళ్ళక తప్పదన్నారు. వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న ప్రధాని మోడీకి గుజరాతీ ఘర్ వాపసీ తప్పదన్నారు. ఆయనను మరోసారి ప్రధాని పీఠమెక్కిస్తే అది ప్రజల పాలిట బలిపీఠమవుతుందన్నారు. బీజేపీ స్టీరింగ్ అదానీ(Adani) చేతుల్లో ఉన్నదని, కార్పొరేట్ దోస్తుల కబంధహస్తాల్లో ఆ పార్టీ చిక్కుకున్నదన్నారు.
హిండెన్‌బర్గ్ రిపోర్టు(Hindenburg Report)తో బీజేపీ ఫుల్ పిక్చర్ ఏంటో దేశంలోని ప్రజలంతా 700 ఎంఎంలోనే చూశారని, ఇక ఏ ట్రైలర్ అవసరం లేదన్నారు. దేశంలోని అవినీతికి కెప్టెన్ నరేంద్ర మోడీ అని కామెంట్ చేసిన కేటీఆర్(KTR)… బీజేపీకి దానికి కేరాఫ్ అడ్రస్ అన్నారు. మజ్లిస్ భుజంమీద తుప్పు పట్టిన తుపాకీతో బీజేపీ కాల్చాలనుకుంటున్నదని, ఎంతకాలం ఈ నాటకం అని అన్నారు. తెలంగాణలో సొంత బలం లేని బీజేపీ అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. పల్లెపల్లెనా బలగం ఉన్న పార్టీ బీఆర్ఎస్(BRS) అని అన్నారు. కేంద్ర నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని చెప్పే అమిత్ షా తొలుత రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న డబ్బుల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: BJP అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం: Amit Shah
Follow us on: Google News, Koo, Twitter