హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. హీరోయిన్లను బెదిరించానంటున్న కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని కాదన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ(Konda Surekha), కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డికి పరువునష్టం దావా నోటీసులు KTR పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చాలా మంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో ఎంత పెద్ద నేతలున్నా వదిలేది లేదని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.