తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్(Krishank)తో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అన్నారు. నిజానిజాలు తేల్చిన తర్వాత మీది తప్పు అయితే మీరు జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని వెంటనే క్రిశాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంట్ బంద్ కారణంగా నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఓ సర్క్యులర్ వైరల్ అయింది. గతేడాది సర్క్యులర్ ఎడిట్ చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీన సూర్యాపేట టోల్ గేట్ వద్ద క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.