KTR | నా వెంట్రుక కూడా పీకలేరు.. దేనికైనా సిద్ధమే.. కేటీఆర్ వార్నింగ్..

-

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా జరగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ముస్తాబాద్ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన క‌రీంన‌గ‌ర్ పార్లమెంట‌రీ స‌మావేశంలో కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు.

- Advertisement -

“సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నుంచి మొద‌లుపెడితే సిరిసిల్లలో ఉన్న కేకే మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర‌కు అంద‌రూ ద‌గుల్బాజీలు, స‌న్నాసులు, చేత‌కాని వెధ‌వ‌లే. నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు ర‌ద్దు చేశారు. మంజూరైన రోడ్డును రద్దు చేయటం కాదు.. ద‌మ్ముంటే, చేత‌నైతే ప్రజ‌ల మ‌న‌సు గెలుచుకోవాలి. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వ‌ర‌కు నేను రెండు లైన్ల రోడ్డు మంజూరు చేశాను. చేత‌నైతే ఆ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చి ప్రజ‌ల మ‌న‌సును గెలుచుకోవాలి. నా మీద కోపంతో సిరిసిల్ల నేత‌న్నల కొంపముంచే ప్రయ‌త్నం చేస్తున్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డర్లు ర‌ద్దు చేశారు.

కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజ‌కీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టులో ఒక బుంగ పడితే దానిని పుడ్చకుండా వానాకాలం వరకు నానబెట్టి ప్రాజెక్టు కొట్టుకుపోయేటట్టు చేయాలని, రైతుల‌కు నీళ్లు ఇవ్వొద్దని, కేసీఆర్‌ను బ‌ద్నాం చేయాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం దివాళాకోరు, ద‌గుల్బాజీ రాజ‌కీయం చేస్తోంది. ఈ మాటలకు నాపై కేసు పెట్టుకుంటే పెట్టుకోండి.. నా వెంట్రుక కూడా పీకలేరు. కేసుల‌కు, జైళ్లకు భ‌య‌ప‌డేది లేదు.. నిత్యం ప్రజ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటాం” అ‌ని కేటీఆర్(KTR) వెల్లడించారు.

Read Also: తెలంగాణలో ఊహించని పరిణామం..బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...