పేపర్ లీకుల కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టుపై మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్వీట్ లో బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదమన్నారు. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఎద్దేవా చేశారు. బీజేపీ(BJP) నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్ధులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా టీఎస్పీఎస్పీ పేపర్ లీకులో కేటీఆర్(KTR), బండి సంజయ్ మధ్య మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వెనక కేటీఆర్ హస్తం ఉందని సంజయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను కేటీఆర్ ఖండిస్తూ పరువు నష్టం దావా నోటీసులు పంపించారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023
Read Also: పేపర్ లీకుల వెనక బండి సంజయ్ కుట్ర ఉంది: హరీశ్
Follow us on: Google News, Koo, Twitter