తెలంగాణ హైకోర్టులో(TG High Court) విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ అడ్వకేట్ పసునూరి వేణుగోపాల్ రావు(Pasunuri Venu Gopal Rao) అనే న్యాయవాది.. ఎప్పటిలానే ఒక కేసుకు సంబంధించి సీరియస్‌గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టడం ప్రారంభమయ్యాయి. అర్థం చేసుకునేలోపే గుండెపోటు వచ్చి నిల్చున్న చోటే కుప్పకూలారు. వెంటనే తోటి న్యాయవాదులు వచ్చి ఆసుపత్రికి తరలించే సరికి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఉన్నతన్యాయస్థానంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాల్ రావు మరణం నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో విచారణలను నిలిపివేస్తున్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.