మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. భారీ మెజార్టీతో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. కాగా మహారాష్ట్రలో ఎన్‌డీఏ కూటమి(NDA) సాధించనున్న ఈ విషయంపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనేది ఐరన్ లెగ్ పార్టీ అని ఇప్పటికైనా నమ్ముతారా అంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ కూటమి వాళ్లు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన మహారాష్ట్ర ప్రజలు మాత్రం ఎన్‌డీఏ కూటమితోనే నిలిచారని అన్నారు. బీజేపీ ఒంటరిగానే 125 స్థానాలు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ కూటమి దెబ్బకు ఎంవీఏ కూటమి(MVA Alliance) బెంబేలెత్తిపోయిందని ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా మనం చేసిన అభివృద్ధికే ఓట్లు పడతాయని మహారాష్ట్ర ప్రజలు నిరూపించారన్నారు.
‘‘మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువు అయ్యింది. బిజేపి(BJP) ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుంది. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉంది. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమి నే మహారాష్ట్ర ప్రజలు నమ్మారు. మహారాష్ట్ర లో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారు. బటేంగే తో కటెంగే అని చాటారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి.
కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్ర కి కాంగ్రెస్ డబ్బులు పంపింది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోడి(Modi) అభివృద్ధి మంత్రం పనిచేసింది. బూతులకి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, మా కార్యకర్తల ముందు పనిచేయలేదు. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు.
‘‘తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కి ఇదే గతి పడుతుంది. మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ మోసాలని మేము ప్రచారం చేసాం. ఇప్పటికైనా తెలంగాణ లో ఇచ్చిన హామీ నెరవెర్చండి..లేదంటే మహారాష్ట్ర(Maharashtra) లో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు..చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్ర లో యాడ్స్ ఇచ్చారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ట్యాపరింగ్ చేశారా?. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణలో ప్రభావం చూపుతుంది. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యింది. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉంది. కులగణన ఫాం పెన్సిల్ తో నింపి మార్చే అవకాశం ఉంది. కులగణన లో భయపెట్టి సర్వే చేస్తున్నారు’’ అని Bandi Sanjay తెలిపారు.