తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్(T Congress) నేతలు దూకుడు పెంచారు. కర్ణాటక ఫలితాలతో రెట్టింపు ఉత్సాహంతో జనాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కర్ణాటక తరహా ఫలితాలు తెలంగాణ రాబట్టడం సులువు అని భావించిన ముఖ్య నేతలు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో పార్టీ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే(Manikrao Thakre) కీలక సూచనలు చేశారు. కష్టపడే వారిని పార్టీ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధ్యతల్ని విస్మరిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. కష్టపడిన వారికే టికెట్ల పంపిణీ ఉంటుందన్నారు. నేతల పరిచయాలతో గ్యారంటీ ఉండదన్నారు. సర్వేల ఆధారంగానే బీ–ఫామ్‌లు వస్తాయన్నారు. ప్రజల పక్షం నేతలకే టిక్కెట్లు వస్తాయని థాక్రే క్లారిటీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ(T Congress)ని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటామన్నారు.