మావోయిస్టు అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్(Katakam Sudarshan) అలియాస్ ఆనంద్ అలియాస్ దూలా(69) గుండెపోటుతో మృతిచెందారు. మే 31 మధ్యాహ్నం 12.20 గంటలకు దండకారణ్య అటవీ ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. సుదర్శన్ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.
విప్లవ సంప్రదాయాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుదర్శన్(Katakam Sudarshan) సంతాప సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1974లో జరిగిన శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో ఆయన ఉద్యమంలోకి ప్రవేశించారు.