బాలుడిని కరవమని ఆ కుక్కలకు నేను చెప్పానా..? విపక్షాలపై మేయర్ సీరియస్

-

Mayor Vijayalakshmi |అంబర్‌పేటలో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్‌ కుటుంబానికి హైదరాబాద్ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆర్థికసాయం అందించారు. సోమవారం అంబర్‌పేట్‌లోని బాలుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు రూ. 9,71,900 ఆర్థికసాయం అందించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం నుంచి కూడా సాయమందేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కుక్కల దాడి ఘటనలపై విపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కుక్కలకు పలానా వాళ్లను కరవాలని తానే చెప్పి పంపిస్తున్నట్లు విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రాజకీయాల్లో రాణించడం ఓర్వలేని వాళ్లు విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేయర్‌గా పని చేయటం అంత సులువు కాదన్నారు.

- Advertisement -
Read Also: రేవంత్ రెడ్డి‌పై మరోసారి YS షర్మిల సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...