Medico Preethi | వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతిచెందింది. గత ఐదురోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. కాగా, కాలేజీలో సైఫ్ అనే సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సైఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రీతిని వేధించినట్లు నిర్ధారించారు. కోర్టులో హాజరు పర్చగా.. 13 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరోపక్క తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న ప్రీతి(Medico Preethi) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు శోకసంద్రంలో మునిగిపోయారు.