Preethi | ప్రీతి ఆరోగ్యంపై తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి తిరిగి వస్తుందని ఇక ఆశలు పెట్టుకోవద్దని డాక్టర్లు తనతో చెప్పినట్లు వెల్లడిస్తూ ఆవేదన చెందారు. ఇప్పటికీ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నా.. బతకడం అనుమానంగానే ఉందని వాపోయారు. నిన్నటి వరకు విషమంగా ఉన్న ఆరోగ్యం.. ఇవాళ మరింత క్షీణించి అత్యంత విషమంగా మారిందని వైద్యులు చెప్పినట్లు నరేందర్ వెల్లడించారు. అంతేగాక, ప్రీతి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం. ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని, ముమ్మాటికీ హత్యాయత్నమే అని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని రోధించారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Preethi బతకడం కష్టమే అని డాక్టర్లు చెబుతున్నారు: తండ్రి నరేందర్
-