రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)పై మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ చేసిన కామెంట్లపై హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని.. సిద్దిపేట నుంచి పోటీచేసినా ఓకే నని.. నాకేమీ అభ్యంతరం లేదని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఫైట్ చేయాలంటే చేయండి అని గవర్నర్కు సూచించారు. బీజేపీ కనుసన్నల్లోనే గవర్నర్ పనిచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. గవర్నర్ను విమర్శించలేక కాదని, పోస్టుకు ఉన్న గౌరవంతో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. మరి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యలపై గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also: తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభవార్త
Follow us on: Google News, Koo, Twitter