కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసీఆర్(KCR) వెనకడుగు వేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షతో తెలంగాణ మీద నిధుల కోత విధించిందని, నీతి ఆయోగ్(NITI Aayog) కూడా ఒక్క పైసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం సెర్ప్ ఉద్యోగులపై హరీశ్ రావు(Harish Rao) ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అతి ఎక్కువ వేతనాలు పొందుతున్నది ఒక్క తెలంగాణ సెర్ప్ ఉద్యోగులు మాత్రమే అని తెలిపారు. సెర్ప్ ఉద్యోగుల కృషి వల్ల సంఘాలు ఐకేపీగా ఏర్పడి చాలా అద్భుతమైన రీతిలో పని జరుగుతుందన్నారు. ఐకేపీ, సెర్ప్ ఉద్యోగుల ప్రోత్సహంతో ఎన్ని అడిగితే అన్ని డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అదుకుంటున్నారన్నారు.
Read Also: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ షూటింగ్ స్టార్ట్ (వీడియో)
Follow us on: Google News, Koo, Twitter