ప్రధాని మోడీపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆసరా పెన్షన్(Aasara Pension), రైతుబంధు(Rythu Bandhu) వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని ఇవి ప్రధానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్(PM Kisan) అయ్యిందని సెటైర్లు వేశారు.
పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకు లబ్ది జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుబంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని అడిగారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIR ను బెంగళూర్‌కు తరలించిన మాట వాస్తవం అని హరీష్(Harish Rao) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read Also: ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశా: బండి సంజయ్
Follow us on: Google News, Koo, Twitter