పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

0
Minister Harish Rao

Minister Harish Rao |రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యా్ప్తిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. కొవిడ్‌ విషయంలో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్యాధికారులను ఆదేశించారు. కొవిడ్‌ విజృంభిస్తుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో మంత్రి హరీశ్ రావు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని అదేశాలు జారీ చేశారు.

Read Also: ‘పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర మంత్రుల హస్తం’

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here