‘మంత్రి పదవికి కేటీఆర్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి’

-

Bandi Sanjay |టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీకి పాల్పడి 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన మంత్రి కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఎనిమిదేళ్లుగా నిరుద్యోగులకు నిర్లక్ష్యం చేసిందని, తీరా నోటిఫికేషన్లు ఇచ్చాక ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంత్రి కేటీఆర్‌ స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే.. లిక్కర్ కుంభకోణంలో చిక్కిన కవితను కాపాడుకోవడానికి మంత్రులంతా ఢిల్లీకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే వారికి ముఖ్యమా? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లోనూ అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పింఛన్ల పంపిణీపై కీలక సూచనలు చేసిన అధికారులు..

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల(NTR Bharosa...

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...