నా పుట్టినరోజున మీ నుంచి కోరుకుంటుంది అదే: కేటీఆర్

-

కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) మళ్లీ రాష్ట్రంలో 100 సీట్లు గెలవడం ఖాయమని అన్నారు. వంద సీట్లు ఎందుకు రావో 2023లో చేసి చూపిద్దామని తెలిపారు. ఏప్రిల్ 27న నా పుట్టినరోజు ఉందని, ఆరోజు కేక్స్‌ కట్ చేసి సెలబ్రేషన్స్ చేయడం కన్నా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలుపు కోసం రాష్ట్రంలోని 60 లక్షల గులాబీ కుటుంబ సభ్యులను కదిలించండి, ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించండి అని సూచించారు. కార్యకర్తలు లేకుండా నాయకులు లేరని అన్నారు.

- Advertisement -

పదువులు వస్తుంటయ్, పోతుంటయ్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాం అన్నది ముఖ్యమని చెప్పారు. సమావేశాల్లో డైలాగులు కొట్టడం ఈజీనే కానీ పని చేయడమే కష్టమని అన్నారు. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అలా మాట్లాడే సంస్కారం తనకు లేదన్నారు. తాను పేపర్ లీక్ చేసి బతుకుతున్నానా అని ప్రశ్నించారు. ఇక ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పుట్టుక గురించి మోడీ పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారని అన్నారు. మోడీ తన దోస్తులకు దోచిపెడుతున్నారని కేటీఆర్(KTR) ఆరోపించారు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని, అదానీ అని విమర్శించారు. అదానీ కోసం మోడీ ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్షను చూపిస్తుందని.. రాష్ట్రాన్ని శత్రువుగా చూస్తుందన్నారు.

Read Also: నిఖత్ జరీన్‌పై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...