కాంగ్రెస్ హయాంలో కరెంట్ వస్తే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త: KTR

-

కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హుస్నాబాద్(Husnabad) నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో రైతు సంక్షేమ ప‌థ‌కాలు అనేకం అమ‌ల‌వుతున్నాయన్నారు. అప‌ర భ‌గీర‌థుడిలా కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను పైకి మ‌ళ్లిస్తున్నాడని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు.. కొండ‌పోచమ్మ, మ‌ల్లన్న సాగ‌ర్, రంగ‌నాయ‌క సాగ‌ర్, మిడ్ మానేరు వ‌ర‌కు నీళ్లు వ‌స్తున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాంతం ఇప్పుడు స‌స్యశ్యామలంగా ఉంద‌న్నారు.

- Advertisement -

ఒక ప్రాజెక్టుకు కొబ్బరి కాయ కొడితే.. అది పూర్తయ్యే న‌మ్మకం లేకుండే. కాలువ‌లు త‌వ్వుతూనే ఉన్నారు. కానీ నీళ్లు రాలేదు. కేసీఆర్(KCR) మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్రాజెక్టులు పూర్తి చేసి, గోదావ‌రి నీళ్లను మీ పాదాల వ‌ద్దకు తీసుకొచ్చార‌ని కేటీఆర్(KTR) తెలిపారు. ఒకప్పుడు క‌రెంట్ కోసం గోస ప‌డ్డాం. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో 9 గంట‌ల క‌రెంట్ అని నరికి 6 గంట‌ల క‌రెంట్ ఇచ్చారు. అది కూడా స‌క్కగా ఇవ్వని ప‌రిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో క‌రెంట్ వ‌స్తే వార్త.. ఇప్పుడు క‌రెంట్ పోతే వార్త అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: భారత్‌లో ఎన్నికలు ఉంటే.. కేసీఆర్ పాకిస్తాన్‌లో ప్రచారం చేస్తారా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...