పాన్ వరల్డ్ మూవీ ‘హనుమాన్’ విడుదల వాయిదా

-

తేజ సజ్జా(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌(Hanuman)’ విడుదల వాయిదాపడింది. ఈనెల 12న రిలీజ్ కావాల్సి ఉండగా.. గ్రాఫిక్స్ పనులు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను అందుకునేలా మరింత ఉన్నతంగా చిత్రాన్ని తీర్చిదిద్దేలా మూవీ యూనిట్ మరింత ఫోకస్ పెట్టింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రకటించింది. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తున్న ఈ చిత్ర టీజర్‌, పాటలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మరాఠి, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియ, చైనీస్, జపనీస్ భాషల్లో ‘హనుమాన్‌(Hanuman)’ రిలీజ్ కానుంది.

- Advertisement -

Read Also: ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం.. థియేటర్ల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...