హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం భాదితులను మంత్రి కేటీఆర్(Minister KTR) గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి కేటీఆర్(Minister KTR) మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులుకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారి జీవనోపాధి దెబ్బతినకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరికి సర్జరీ జరుగుతుంది. ప్రభుత్వం, పార్టీ తరుపున వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపారని అన్నారు. మంత్రి కేటీఆర్ తోపాటు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.
కాగా, బుధవారం ఖమ్మం జిల్లా కారేడు మండలం, చీమలపాడు(Chimalapadu) బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పూరిగుడిసెపై పడ్డాయి. మంటలు చెలరేగడంతో గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: వేసవిలో దొరికే పుచ్చకాయను ప్రతిరోజూ తినవచ్చా?
Follow us on: Google News, Koo, Twitter