రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘మేమే ఫేమస్’ సినిమా ఫంక్షన్‌లో చీఫ్ గెస్ట్‌గా మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. మధ్యపానం, ధూమపానం, షికార్లు, అమ్మాయిల వెంటపడడం.. ఇలాంటివి చేస్తే ఫేమస్ కారు. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారని అన్నారు. ‘నేను కూడా పాలమ్మిన.. పూలమ్మినా.. కాలేజీలు పెట్టిన.. టాప్ డాక్టర్లను.. సైంటిస్టులను తయారు చేశాను. అదీ ఫేమస్. కాబట్టి యువత కష్టపడి పనిచేసి అన్నింటా విజయాన్ని అందుకోవాలి. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.’’ అని అన్నారు. అలాగే ఎన్నికలు అయిపోయాక పలు తెలంగాణ యాసలో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తానని మల్లారెడ్డి(Minister Malla Reddy) అన్నారు. ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ తమ ఇంటికి వచ్చి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాలో విలన్‌గా నటించాలని కోరినట్లు తెలిపారు. దానికి తాను నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: కాంగ్రెస్ పార్టీ ప్రజల డీఎన్‌ఏలో ఉంది: నటుడు శివాజీ
Follow us on: Google News, Koo, Twitter