పొంగుటేటి ఓ బచ్చా.. డబ్బుతో బలిసిపోయారు: పువ్వాడ

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)పై మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ఉంటూనే సొంత పార్టీ నేతలను ఓడించేందుకు చూశారని అందుకే పార్టీ నుంచి బహిష్కరించామని తెలిపారు. పొంగులేటి తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని ఆరోపించారు. పొంగులేటి తీరు పిట్టలదొర మాదిరే ఉందని.. తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని విమర్శించారు. డబ్బు ఉందని బాగా బలిసిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మం(Khammam) జిల్లాలో తమ కుటుంబానికి ఘన చరిత్ర ఉందని, 60 ఏళ్లుగా తాము నికార్సయిన రాజకీయాలు చేస్తున్నామని పువ్వాడ(Puvvada Ajay) తెలిపారు.

- Advertisement -

కాగా అంతకుముందు పొంగుటేటి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, బీఆర్ఎస్ నేతలకు నిద్ర కరవైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందుంది ముసళ్ల పండుగ అని అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తో పాటు ఖమ్మం జిల్లా నేతలను ప్రజలు ఇంటికి పంపబోతున్నారని పొంగులేటి జోస్యం చెప్పారు.

Read Also: ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MLC Jayamangala | వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా..

వైసీపీ(YCP)లో రాజీనామాల పర్వానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. ఒకరి తర్వాత...

Devendra Fadnavis | మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలించిన మోదీ నినాదం..

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి(BJP Alliance) రికార్డ్ స్థాయి విజయం నమోదు...