Seethakka | భారత్‌కు బీజేపీ ఏం చేసింది.. బండికి సీతక్క సూటి ప్రశ్న

-

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క(Seethakka) ఫైరయ్యారు. ‘బీజేపీది భారత్ టీం అని.. కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం’ అన్న ఆయన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి సీతక్క తప్పుబట్టారు. దేశంలో మత రాజకీయాలను పెంచి పోషించడం తప్ప బీజేపీ ఏం చేసింది? అని ప్రశ్నించారు. బీజేపీకి మోసాలు చేయడం, మత రాజకీయాలు చేయడం తప్ప ఏమొచ్చంటూ విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.

- Advertisement -

‘‘గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్(Bandi Sanjay) పాల్పడుతున్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదు. సూటిగా బండి సంజయ్‌ని అడుగుతున్నా. పట్టభద్రులకు మీరేం చేశారు’’ అని నిలదీశారు.

‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) ఓటు అడిగి నైతిక హక్కు బీజేపీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారు. ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. దేవునికి వినియోగించే అగర్బత్తుల మీద కూడా జీఎస్‌టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్‌టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది ఏమి లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి. ట్రైబల్ యూనివర్సిటీ(Tribal University) పనులు కూడా మొదలుపెట్టలేనీ అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది.

బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని అవమానపర్చకండి బండి సంజయ్’’ అని సూచించారు.

‘‘పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ ఔన్నత్యాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాల అవసరమా.

పట్ట భద్రులారా ఆలోచించండి. విద్యా వేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. సంవత్సరకాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అని ఆమె(Seethakka) పిలుపునిచ్చారు.

‘‘యువతనీ మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ(BJP) రాజకీయం. బీఆర్ఎస్(BRS), బీజేపీ రెండూ పార్టీలు దొందూ దొందే. జఠిలమైనా ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేష పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది. అన్ని రంగాల వెనుకబడ్డ పాకిస్తాన్తో భారతదేశాన్ని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలి’’ అని అన్నారు.

Read Also: కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం: బండి సంజయ్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...

Annamayya District | గూండాల కోనలో గజేంద్రల బీభత్సం.. ముగ్గురు మృతి

Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం...