మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) ఘాటుగా స్పందించారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు ఎందుకని.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచారం సమయంలో తాము ఇచ్చిన హామీలకు మరికొన్ని హామీలు జోడించి బీఆర్ఎస్ మేనిఫెస్టో(BRS Manifesto) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటిది వారు ఎలా ప్రశ్నిస్తున్నారని.. ప్రతి ఒక్క హామీని తాము తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
Minister Seethakka Strong Reply to KTR | కాగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది..? తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్న హామీ ఎక్కడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట మొదలైందని విమర్శలు గుప్పించారు.