మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వస్తామని చెప్పారు. ఆయన 125వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభించామన్నారు. సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని కేటాయించమన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Read Also: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి బోల్తా
Follow us on: Google News, Koo, Twitter