నంది అవార్డుల(Nandi Awards) వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరఫున ఎవ్వరూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలేదని.. ఎవరు పడితే వాళ్లు అడితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై తలసాని పరోక్షంగా స్పందించారు.