తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్(Mahabubnagar)లో భూమి స్పల్పంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రెక్కార్ స్కేలుపై 3.0 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భూకంప కేంద్రాన్ని కైకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో గుర్తించినట్లు అధికారువు వివరించారు. శనివారం మధ్యాహ్నం 1:22 గంటల ప్రాతంలో ఈ భూకంపం సంభవించింది.
- Advertisement -
Mahabubnagar | భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కాగా ఇటీవలే ములుగు జిల్లాలో భూకంపం వచ్చి.. కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం ఇందుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.