Ameerpet Crime: మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. ఆపై అత్యాచారం

-

minor girl kidnapped and Raped at Ameerpet Crime:మీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన కామాంధులు అత్యాచారం చేశారు. మీర్‌పేట (Ameerpet)పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లెనిన్‌ నగరంలో నివాసం దంపతులకు 9వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సదరు బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా, కొంతకాలంగా ఆమెపై కన్నేసిన కామాంధులు బాలికను కిడ్నాప్‌ చేశారు. రాత్రి 11 గంటల వరకు బైక్‌పై పలు ప్రాంతాలకు నిందితులు తిప్పారు.

- Advertisement -

ఎవరూ లేని ఖాళీ ప్రాంతంలో బాలికపై అత్యాచారం చేశారు. బాలిక కదలకుండా చేతులు ఒకరు పట్టుకోగా.. మరొక నిందితుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండో నిందితుడు అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. బాలిక గట్టిగా కేకలు వేయటంతో.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాలికను రక్షించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించటంతో, బాలిక ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, గత కొద్దిరోజులుగా నిందితుల్లో ఒక యువకుడు తనను వెంబడిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...