తెలంగాణ ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రికి అసలు నీరా(Neera) అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు నీరా కేఫ్(Neera Cafe)లు అంటూ కొత్తగా ఏదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. నీరా అంటే ఏంటో ఆబ్కారీ మంత్రికి అవగాహన లేదేమో అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యరశ్మి పడకముందే నీరా తాగాలని ఆయన చెప్పారు. సూర్య కిరణాలు తాకిన తరువాత అది కల్లుగా మారుతుందని అన్నారు. గ్రామాల్లో అనధికారంగా మద్యం బెల్టు షాపులు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకోకుండా, మిగితా విషయాలు చెబుతూ మభ్య పెట్టడం సరైంది కాదని జీవన్ రెడ్డి(Jeevan Reddy) చెప్పారు.
Read Also: రెజ్లర్ల ఆందోళనకు బీఆర్ఎస్ సపోర్ట్
Follow us on: Google News, Koo, Twitter