ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కార్యాలయంలో మహిళను విచారించడం చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, రేపు(మార్చి 16) రెండోసారి ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కవిత(MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రేపు మరోసారి విచారించనున్న సంగతి తెలిసిందే.
- Advertisement -
Read Also: రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
Follow us on: Google News