ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి కవిత(MLC Kavitha)ను విచారించింది ఈడీ. సోమవారం ఉదయం మొదలైన ఈడీ విచారణ దాదాపు పది గంటల సేపు కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన రామచంద్ర పిళ్లైతో కలిపి అధికారులు ఆమెను ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీసుకు ఢిల్లీ ఎస్కార్ట్లు వాహనం, మహిళా వైద్య బృందం, తెలంగాణ అడిషనల్ ఏజీ సహా కవిత ప్రతినిధులు రావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది.
కాగా సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత.. నవ్వుతూ ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చారు. కారులో కూర్చొని బీఆర్ఎస్ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపించారు. ఈడీ ఆఫీస్ నుంచి ఆమె తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది.
Read Also: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి.. చంద్రబాబు కీలక నిర్ణయం
Follow us on: Google News Koo