బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ప్రచార వాహనంలో నిలబడి ఉన్న ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తోటి కార్యకర్తలు వెంటనే ఆమెను చెట్టు కిందకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. కాసేపటి అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురై కవిత(MLC Kavitha) అస్వస్థతకు గురైనట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. మూడు రోజులుగా గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఆమె నీరసంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్(Sanjay) స్వతహాగా వైద్యుడు కావడంతో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించడంతో వెంటనే కోలుకున్నారు.