ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. రెండవసారి విచారణనను ఎదుర్కోనున్నారు. ఈ నెల 16 న విచారణకు హాజరుకాని కవిత. తెలంగాణ మంత్రులు కూడా ఆమెతో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. రామచంద్ర పిళ్ళై తో కలిపి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
- Advertisement -
మార్చి 16 న మరోసారి విచారణకు హాజరవ్వాలని ఆదేశించడంతో.. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంట్లోనే విచారించాల్సిన ఈడీ.. చట్ట విరుద్ధంగా కార్యాలయానికి పిలుస్తున్నారని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ వేగంగా చేపట్టాలని కోరడంతో నిరాకరించిన సుప్రీమ్ కోర్ట్ మార్చి 24 విచారణ చేపడతామని స్పష్టం చేసింది
Read Also: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ.. కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు
Follow us on: Google News Koo