ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు(Peddagattu Jathara) జాతరలో పాల్గొన్నారు. చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. బోనం ఎత్తుకున్న కవితకు స్వాగతం పలికిన ఆలయ పూజారులు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజున లింగమంతుల జాతరకు రావడం యాదృచ్చికం.. అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో గుట్ట ప్రాంతాన్ని సందర్శనకు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోనే సూర్యాపేట జిల్లా సాకారమైందని అన్నారు.
గతంలో సూర్యాపేట(Suryapet)ను పరిపాలించిన పార్టీలు ఏనాడూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయకపోగా.. NRI లు కాలేజీ లు పెడతామని చెప్పిన వారికి సహకరించలేదని ఆరోపించారు. ప్రతిఒక్కరికి విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ ను BRS ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. కానీ, ఇప్పుడు హాస్టల్స్ లో విష ఆహరం తిని విద్యార్థులు చనిపోతున్నా పట్టింపు లేని ముఖ్యమంత్రి ఉన్నాడని అని విమర్శించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వారిని గౌరవించాం.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు రూ. 2500, స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 % క్రైమ్ రేటు పెరిగింది. కేసీఆర్ హయాంలో తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా పరిపాలన ఉందని తెలిపారు. నేడు రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కృష్ణా పరివాహక ప్రాంతమైన సూర్యాపేటకు కాళేశ్వరం(Kaleshwaram) ద్వారా ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్(KCR) కే దక్కిందని కవిత(MLC Kavitha) అన్నారు.