Moinabad audio leak: ఫాంహౌస్ ఘటనలో ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని రోహిత్ బదులిచ్చారు. కేసీఆర్ (KCR)కు తెలిస్తే తమ జీవితాలు నాశనం అవుతాయని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు, ఆదాయపు పన్ను దాడులు జరగకుండా చూసుకుంటానని రామచంద్ర భారతి చెప్పారు. కానీ ఎక్కడా ఫలానా పార్టీ అని భారతి చెప్పలేదు. అయితే.. ఫాంహౌస్ మీటింగ్‌కు ముందు రామచంద్ర భారతితో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది.
ఈ (Moinabad audio leak) ఆడియోతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్, సింహయాజులు, విష్ణువర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి.. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. కేసులో స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించడంతో నంద కుమార్, సింహయాజులు, విష్ణువర్థన్‌రెడ్డిలను విడుదల చేసిన విషయం తెలిసిందే..