MP Arvind fires on Minister KTR Over his Comments on Drugs case: మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీకు డయాబెటిస్ ఉంది.. నీ కిడ్నీలు ఎవడికి కావాలని అన్నారు. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఇంతవరకు వెంట్రుకలు ఇవ్వలేదని, బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో విచిత్రమైన హామీలు చేసారని, ఎన్నికల అనంతరం హైదరాబాద్ రూపురేఖలు మారుసూస్తామని చెప్పి నెరవేర్చలేదని అన్నారు. వరదల్లో మునిగిపోయిన వారికి రూ. 10000 ఇస్తామని హామీ ఇచ్చారు అది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ,ఉచిత ఎరువులు ఏ హామీ అందించలేదని అన్నారు. లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్ అంటూ ఎంపీ అరవింద్(MP Arvind) ఎద్దేవా చేసారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం లో దోషి అని తెలిపితే జైలుకు పోవడం కాయం అని అన్నారు.
అంతకుముందు డ్రగ్స్ కేసు లో తనకు ఎలాంటి సంబంధం లేదని, టెస్ట్ కు రక్తంతో పాటు కిడ్నీ ఇస్తా. వెంట్రుకలు కాదు నా బొచ్చు పికి ఇస్తానని ఘాటు వ్యాఖ్యలు చేసారు మంత్రి కేటీఆర్. టెస్ట్ లో క్లియర్ అని తేలితే బండి సంజయ్ కరీంనగర్ లో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు.