ములుగు(Mulugu) జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish) గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేస్తున్న ఆయన ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అజర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా కొద్ది నెలల క్రితమే ఆయనకు గుండెపోటు రావటంతో వైద్యం చేయించగా కోలుకున్నారు. కానీ ప్రస్తుతం మళ్లీ హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు.