Nagole Gold Theft Case in gold shop: నాగోలు బంగారం చోరీ కేసులో కీలక అంశాలను పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. చోరీ చేసిన వారంతా 25 ఏళ్ల లోపు యువకులని.. మాస్క్ లు ధరించి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు వివరించారు. కాగా.. దుండగులు దొంగిలించిన బైక్‌లను బంగారం చోరీ కేసులో వాడినట్లు గుర్తించారు. దుండగులు దొంగిలించిన బ్యాగ్ లో 3 కిలోల బంగారం రూ.5లక్షలు నగదు ఉందని.. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా.. దుండగులు ప్రయాణించిన రూట్లలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -