నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సై మహేందర్ భార్య వినూత్న నిరసన చేపట్టారు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన ఫ్లెక్సీ ని పట్టుకొని నిరసన తెలిపింది. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.
Nalgonda | ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ భార్య మాట్లాడుతూ… తన భర్త మహిళా కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆరోపించింది. ఆమెతో ఉంటూ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సై తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి తనను, తన పిల్లల్ని చంపేయడానికి చూస్తున్నాడని వెల్లడించింది. గుండాలను తీసుకొచ్చి తన తండ్రిని కొట్టించాడని, ఎస్సై వేధింపులు భరించలేక తన తండ్రి మరణించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి తనపై హత్యాయత్నం కూడా చేశారని వాపోయింది. వారి చేతిలో చనిపోయే కంటే కారుణ్య మరణానికి(Mercy Killing) అనుమతించాలని కోరుతున్నట్టు తెలిపింది.